two-snakes-causes-traffic-jam-

రెండు పాములు నడి రోడ్డుపైకి వచ్చి..

కాలిఫోర్నియా: ఓ రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. చూస్తుండగానే భారీగా ట్రాఫిక్‌‌జాం అయ్యింది. అయితే రోడ్డుపై ఏదైన యాక్సిడెంట్ జరిగిందా అంటే అలాంటిదేమీ లేదు. మరెందుకు అంత ట్రాఫిక్‌జాం అయిందని తెలుసుకునేందుకు 26 ఏళ్ల యువకుడు తన కారు దిగి కొంతదూరం నడిచి వెళ్లాడు. రెండు పాముల వల్ల సుమారు 10 నిమిషాలపాటు ట్రాఫిక్‌జాం అయ్యిందని అతడు తెలిపాడు. వెంటనే ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. మీరు కూడా ఆ వీడియో చూడండి..