ఫ్లోరిడా: పెంపుడు కుక్క ఒక్కసారిగా మొరగడం మొదలుపెట్టింది. ఎంతసేపైనా ఆ కుక్క మొరగడం ఆపడం లేదు. దాంతో ఆ ఇంటి యజమానురాలికి అనుమానం వచ్చింది. ఏదో ఆపద ముంచుకొచ్చిందని అభిప్రాయపడింది. అప్పటికే కిచెన్లో ఉన్న ఆమె వెంటనే హల్లో ఉన్న తన పెంపుడు కుక్క వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది. కిటికీ అద్దాలవైపు చూస్తు కుక్క మొరగడాన్ని ఆమె గమనించింది. కిటీకి పరదాలను కొద్దిగా పక్కకు తొలగించి చూసేసరికి రెండు పాములు అక్కడ వేలాడుతూ కనిపించాయి.
వెంటనే ఆమె స్నేక్ క్యాచర్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించింది. మూడంస్తుల భవనం కిటీకిపై వేలాడుతున్న రెండు పాములను స్నేక్ క్యాచర్ సభ్యులు పట్టుకున్నారు.