two-people-died-because-of-horse-

గుర్రం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు..

టెక్సాస్: రోడ్డుపై ఓ గుర్రం హల్ చల్ చేసింది. దాంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం గం.12 సమయంలో ఓ వ్యక్తి గుర్రంతో రోడ్డుపై ప్రయాణించాడని పోలీసులు చెబుతున్నారు. అయితే గుర్రం అతడి అదుపులో లేకుండా ఇష్టం వచ్చినట్లు పరుగెత్తడం వల్ల వాహనాదారులు గందరగోళానికి గురయ్యారని పోలీసులు చెబుతున్నారు. అందువల్లే ఎక్కువ సంఖ్యలో యాక్సిడెంట్లు జరిగాయన్నారు. ఇదిలావుండగా ఈ ప్రమాదంలో గుర్రం కూడా మరణించిందని వారు తెలిపారు. గుర్రంపై ప్రయాణించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఫామ్‌హౌజ్‌లో పనిచేస్తున్న అతడు గుర్రంపై పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.