trump-signed-on-a-cap-

ట్రంప్ సంతకంతో కూడిన క్యాప్ పెట్టుకుని..

టెక్సాస్: డోనాల్డ్ ట్రంప్ స్వయంగా సంతకం చేసిన క్యాప్‌(టోపీ)ను శాన్ ఆంటోనియో(30) అనే వ్యక్తి పెట్టుకున్నాడు. తనకు స్వయంగా ట్రంపే ఆ క్యాప్‌ను పంపించాడని అతడు చెబుతున్నాడు. వాటా బర్గర్ అనే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్న ఆంటోనియో అధ్యక్షుడి సంతకంతో కూడిన క్యాప్ పెట్టుకుని ఫుడ్ సర్వ్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. కొంతమంది ఆంటోనియో క్యాప్ ధరించిన సమయంలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

దాంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలను జూనియర్ ట్రంప్ కూడా చూశాడు. తన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో వాటిని పోస్టు చేశాడు. అయితే వైట్ హౌజ్ వర్గాలు మాత్రం అధ్యక్షుడి సంతకంతో కూడిన క్యాప్‌ను ఆంటోనియో దొంగతనం చేశాడని ఆరోపిస్తున్నాయి.