:: Welcome to NRI - Article ::

అమెరికాకు కష్ట కాలమిది: ట్రంప్

ఫ్లోరిడా: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దేశంలో సంభవిస్తున్న వరుస తుఫాన్‌లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి తుఫాన్‌ల వల్ల పెద్దగా ప్రాణ నష్టం జరగలేదని ట్రంప్ స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి అన్ని చర్యలు చేపట్టడం వల్లే ప్రజలు సురక్షితంగా ఉన్నారని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఆదివారం నేట్ తుఫాన్ కారణంగా అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన వర్షం కురిసిందని, దేశ చరిత్రలో విషాదకరమైన ఆదివారం ఇదే అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. జాతీయ రక్షణ దళం ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి ట్రంప్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

దేశంలోని అన్ని విపత్తు నిరోధక శాఖలు సమన్వయంతో పని చేయాలని ట్రంప్ ఆదేశించారు. స్థానికులకు ఇది ఎమర్జెన్సీ కాలం వంటిదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, ఆహారం అందుబాటులో ఉంచాలని తన ప్రకటనలో పేర్కొన్నారు. బ్రోక్సి ప్రాంతంలో నేట్ తుఫాన్ వల్ల తీవ్ర నష్టం జరిగిందని ట్రంప్ తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే తుఫాన్ తన ప్రభావాన్ని చూపిందన్నారు. 56 వేల మంది ఉంటున్న ఆ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం కూడా అందుబాటులో లేకుండాపోయిందన్నారు.