tropical-strom

భారీ తుఫాన్.. విరుచుకుపడబోతోందని..

మియామి: సముద్ర తీరంలో అల్లకల్లోలం ఏర్పడింది. బలమైన గాలులు వీస్తున్నాయి. అలలు చాలా ఎత్తులో ఎగసిపడుతున్నాయి. కొద్ది గంటల్లోనే భారీ తుఫాన్ విరుచుకుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు. అమెరికా ఈశాన్య ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అమెరికాతోపాటు యూరప్ కూడా తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొబోతోందన్నారు. తుఫాన్ వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రజలకు అత్యవసర సహయం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది.