tree-fallen-on-home-

ఇంటిపై చెట్టు కుప్పకూలడంతో..

లూసియానా(అమెరికా): అర్ధరాత్రి గం.12-30 నిమిషాలకు భారీ వర్షం కురవడం మొదలైంది. వర్షం కురవడంతోపాటు గాలి కూడా వేగంగా వీస్తోంది. అంతలో ఓ ఇంటిపై పెద్ద చెట్టు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో రెండేళ్ల పాప మరణించిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో పాప నిద్రపోతుందన్నారు. అదే సమయంలో ఆ ఇంట్లో పాపతోపాటు నలుగురు వ్యక్తులు కూడా ఉన్నారని వారు చెప్పారు.

అయితే చెట్టు కూలేందుకు వర్షం మాత్రమే కారణం కాదని అధికారులు తేల్చారు. వర్షం కురిసేందుకు ముందే లూసియానాలో టోర్నడోలు విరుచుకుపడ్డాయని వారు తెలిపారు. టోర్నడోలు తరచూ సంభవిస్తూ భీభత్సం సృష్టిస్తున్నాయని వారు చెబుతున్నారు. టోర్నడోలు సంభవించే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండొద్దని వారు సూచించారు.