training-for-gun-shooting-

తుపాకీ వాడకంపై టీచర్లకు శిక్షణ..

ఫ్లోరిడా: పాఠశాలల్లో పనిచేసే టీచర్లందరికీ తుపాకులు వాడటం తెలియాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్క్‌ల్యాండ్ స్కూల్ జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొంతమంది టీచర్లకు తుపాకుల వాడకంపై శిక్షణిస్తున్నారు. దశలవారీగా తుపాకులను ఎలా వాడాలో వారికి వివరంగా తెలియజేస్తున్నారు. ఒకవేళ దుండగులు తుపాకులతో స్కూల్‌లోకి వస్తే ఎలా ఆత్మరక్షణ కల్పించుకుంటూ దుండగుడిపై కాల్పులు ఎలా జరపాలో తెలియజేశారని టీమ్ బ్లూట్ అనే టీచర్ తెలిపాడు. తాను మొదటిసారిగా జీవితంలో తుపాకీ పట్టుకున్నానని అతడు చెబుతున్నాడు. అయితే ఈ శిక్షణ తనకు ఏదో ఒక సందర్భంలో తప్పకుండా ఉపయోగపడుతుందని అతడు అన్నాడు. ఈ మధ్య కాలంలో అమెరికాలో తుపాకుల వాడకం పెరిగిపోయిందని టీమ్ తెలిపాడు. అందువల్ల అందరికీ ఇలాంటి శిక్షణ అవసరమని టీమ్ అభిప్రాయపడ్డాడు.