toxic-algae-problem

బీచ్‌కెళ్లిన రెండేళ్ల బాలుడు చివరికి..

ఫ్లోరిడా: రెండేళ్ల బాలుడు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. తల్లి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లు అతడిని పరీక్షించారు. రెడ్ అల్గే(ఒకరకమైన సముద్రనాచు) నుంచి విడుదలైన బ్యాక్టీరియా వల్లే అతడికి శ్వాస సంబంధిత సమస్య వచ్చిందని డాక్టర్లు తేల్చారు. రెండు రోజుల క్రితమే తన కొడుకును స్వయంగా తానే బీచ్‌కు తీసుకెళ్లానని తల్లి చెబుతోంది. అంతకు ముందెన్నడూ ఇటువంటి సమస్య ఎదురవ్వలేదని తెలిపింది. అయితే ప్రస్తుతం రెడ్ అల్గే వల్ల ప్రమాదకర బ్యాక్టీరియా విస్తరిస్తున్నందు వల్ల జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణహని కూడా కలిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 

అయితే డాక్టర్లు మాత్రం బీచ్‌లవైపు వెళ్లొద్దంటున్నారు. ఫ్లోరిడాలోని కొన్ని బీచ్‌ల్లో రెడ్ అల్గే వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతోందని నిపుణులు కూడా ధృవీకరించారు. చేపలు, అరుదైన సముద్ర జీవులు చనిపోతున్నాయని వారు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో రోజు చేపలు చనిపోయి తీరానికి కొట్టుకొస్తున్నాయంటున్నారు. దాంతో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు.