TORNADOS-WILL-HIT-

టోర్నడోలు విరుచుకుపడతాయని..

ఫ్లోరిడా: దక్షిణఫ్లోరిడాతోపాటు పలు ప్రాంతాల్లో టోర్నడోలు విరుచుకుపడే ప్రమాదముందని వాతావరణశాఖ హెచ్చరించింది. టోర్నడోలే కాకుండా భారీ తుఫాన్ కూడా రాబోతున్నట్లు చెబుతోంది. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడమే అందుకు కారణమని అధికారులు చెప్పారు. ఇప్పటికే సముద్రాల్లో అలలు చాలా ఎత్తులో వేగంగా ఎగసిపడుతున్నాయన్నారు. కొన్ని మైళ్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయని అధికారులు తెలిపారు.

గాలి ఎక్కువగా వీచే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో టోర్నడోలు సంభవించినప్పుడు 28 లక్షల మంది వినియోగదారులు తమ ఇళ్లల్లో కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అధికారులు గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా పామ్ బీచ్ కంట్రీలో తుఫాన్‌లు, టోర్నడోలు సంభవించినప్పుడు కరెంట్ సమస్యలు ఎక్కువగా తలెత్తాయని అధికారులు తెలిపారు.