tornado-alerts-given-

టోర్నడో సంభవించే అవకాశముందని...

ఫ్లోరిడా: జాతీయ వాతావరణ శాఖ అధికారులు టోర్నడో(గాలితుఫాన్)హెచ్చరికలు జారీ చేశారు. ఫ్లోరిడా ఆగ్నేయ తీరంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా టోర్నడో సంభవించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ తీరానికి 11 మైళ్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమయిందన్నారు. ప్రస్తుతం ఆ అల్పపీడనం మార్టిన్ కంట్రీ  వైపు కదులుతోందని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

అయితే టోర్నడోలు సంభవించడం అమెరికాలో సాధారణమేనని అధికారులు చెబుతున్నారు. అయితే  కొన్ని సందర్భాల్లో టోర్నడోలు తీవ్ర నష్టం కలిగిస్తాయని వారు అన్నారు. అందువల్లే టోర్నడోలు సంభవించే ముందే ప్రజలకు సమాచారం అందించి అప్రమత్తం చేస్తుంటామని అధికారులు చెబుతున్నారు.