:: Welcome to NRI - Article ::

చావు ఈ ఫ్లోరిడా పిల్లల చుట్టూ తిరిగింది..!

 

ఫ్లోరిడా: చావు పిల్లల చుట్టూ తిరగడమేమిటనుకుంటున్నారా..? ఈ వీడియో చూస్తే నిజమేనని ఒప్పుకుంటారు. ఫ్లోరిడాలో బ్రెవార్డ్ కంట్రీలోని రాక్లెడ్జ్ నగరంలోని ఓ ఇంటిలో జరిగిన భయోత్పాత సంఘటన ఇది. అక్టోబర్ 21, శుక్రవారం అర్ధరాత్రి 1:40 నిమిషాల సమయంలో ఓ ఇంటిలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించారు. వారిలో ఒకరు బయట ఉండగా.. మరొకరు చేతిలో గన్ పట్టుకుని లోపలికి చేరుకున్నాడు. సోఫాలో గాఢ నిద్రలో ఉన్న ఇద్దరు పిల్లల చుట్టూ తిరిగాడు. సోఫాల దగ్గర ఉన్న సెల్‌ఫోన్, క్రెడిట్ కార్డ్‌లను తీసుకున్నాడు. ఆ తర్వాత యథావిధిగా బయటకు వెళ్లిపోయారు. తెల్లవారిన తర్వాత సెల్‌ఫోన్, క్రెడిట్ కార్డులు పోయినట్లు గమనించారు. దీంతో ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వీడియోలు చూస్తే జరిగిన విషయం అర్థమయింది. దీంతో వీడియోను చూపించి పోలీస్‌స్టేషన్లో ఆ కుటుంబం కేసు పెట్టింది.  ఆ సమయంలో కనుక.. పిల్లల్లో ఎవరికయినా మెలకువ వస్తే.. దగ్గరే ఉన్న పిస్తోల్‌తో కాల్చేసేవారని కుటుంబ సభ్యులు బయపడిపోయారు. ఆ వీడియోను మీరూ చూడండి. 

 

Loading...