:: Welcome to NRI - Article ::

ప్రేయసిపై కోర్టులో వ్యాజ్యం.. కంగుతినే కారణం

టెక్సాస్: మారుతున్న కాలంతోపాటు వ్యక్తులు, వారి జీవన విధానాల్లో మార్పులు వస్తున్నాయి. వ్యక్తులే కాకుండా కోర్టులాంటి వ్యవస్థల్లో కూడా మార్పులు రావాలని కొత్త సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలని సూచించే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురించి తెలిస్తే నిజమేనని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.. టెక్సాస్ నగరంలోని ఓ కోర్టులో కొంచెం కొత్త తరహా వ్యాజ్యం నమోదైంది. 37 ఏళ్ల వయసున్న బ్రాండన్ వెజ్‌మార్ అనే వ్యక్తి తాను డేటింగ్ చేస్తున్న యువతి క్రుజ్‌పై కోర్టులో వ్యాజ్యం వేశాడు. కారణం ఏంటంటే.. వెజ్‌మార్ ‘గార్డియన్ అఫ్ ది గెలాక్సీ’ అనే సినిమా చూస్తున్న సమయంలో ప్రేయసి క్రుజ్ మెసేజులు పంపించింది. చాటింగ్ చేయాలని కోరింది. తర్వాత మాట్లాడతానని వెజ్‌మార్ చెప్పినా పట్టించుకోకుండా మెసేజులు, కాల్స్ చేసింది. వరుసగా 10 నుంచి 15 మెసేజులు పంపించింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సినిమా తనకు అర్థం కాలేదని, తన టికెట్ డబ్బులు తనకు ఇవ్వాలని వెజ్‌మార్ డిమాండ్ చేశాడు. యువతి నిరాకరించడంతో కోర్టులో వ్యాజ్యం వేశాడు. తన టికెట్ డబ్బులు 17 డాలర్లు అనగా భారతీయు కరెన్సీలో 1100 రూపాయలు ఇప్పించాలని కోరాడు. కేసు దాఖలు చేసిన అనంతరం ఇద్దరి మధ్య సంధి కుదరడంతో వివాదం ముగిసింది. ఈ కేసుపై విచారణ జరపాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో ఘటన చర్చనీయాంశమైంది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ నగరంలో వెలుగులోకి వచ్చింది. 

Loading...