:: Welcome to NRI - Article ::

ఆట మద్యలో.. ఆ సౌండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాలేదు..

ఫ్లోరిడా: సారోస్టా  మైదానంలో అంతర్జాతీయ పురుషుల టెన్నిస్ మ్యాచ్ జరుగుతోంది. ప్రేక్షకులతో స్టేడియం మొత్తం నిండిపోయింది. ఆటగాళ్లు ఫ్రాన్సిస్ టైఫో, మైకేల్ క్రూజర్‌లు తమ ఆటతీరుతో ప్రేక్షకులను చూపుతిప్పుకోకుండా చేస్తున్నారు. అయితే ఎక్కడినుంచో వస్తున్న, శృంగారశబ్దాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అసలేం జరుగుతుందో కొద్దిసేపు ఎవరికీ అర్థం కాలేదు. వ్యాఖ్యాత ఎవరో పెద్ద సౌండ్ పెట్టుకుని ఫోర్న్ వీడియో చూస్తున్నారని, వారు దయచేసి వెంటనే దాన్ని ప్లే చేయడం ఆపేయాలని కోరాడు.

అయినా శబ్దాలు మాత్రం అలాగే వస్తున్నాయి. మళ్లీ ఆయన ప్రేక్షకులకు అదేవిధంగా  అప్పీలు చేశాడు. అయినా చప్పుళ్లు ఆగడపోవడంతో చివరికి మైదానంలో ఎవరూ అలాంటి పని చేయడం లేదని గ్రహించారు. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఒక జంట శృంగారంలో పాల్గొంటున్నారని, ఆ శబ్దాలు వారి గదిలో నుంచే వస్తున్నాయని తెలిసి, అందరూ నవ్వుకున్నారు. ఆ శబ్దాలు ప్రేక్షకులనే కాకుండా, ఆటగాళ్లను కూడా ఇబ్బంది పెట్టాయి. వారి ఆటతీరుపై దాన్ని ప్రభావం కనిపించిదని, ఒక సందర్భంలో క్రూజర్ బంతి తనవైపు వస్తున్నా విషయాన్ని కూడా మరిచి, ఆ శబ్దాలను వింటూ నిలబడిపోయాడని ప్రేక్షకుడోకాయన చెప్పారు. బహుశా టెన్నిస్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారేమోనని ఆయన అన్నారు. 

వీడియో కోసం క్లిక్ చేయండి.