teen-stabs-man-82-for-ungry

నాలుగు రోజులుగా ఏమీ తినలేదు..ఆకలితో ఏం చేశాడంటే..

ఫ్లోరిడా: 18 ఏళ్ల యువకుడు.. 4 రోజులుగా ఆకలితో ఉన్నాడు. తినడానికి అతడికి ఏమీ దొరకలేదు. ఏం చెయ్యాల్లో యువకుడికి పాలుపోలేదు. ఈ పరిస్థితులే అతడిని నేరస్థుడిగా మార్చాయి. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన టైలర్ హైడెన్ ఓవెన్స్ అనే 18 ఏళ్ల యువకుడు పక్కింటి వ్యక్తిని కత్తితో పొడిచాడు. ఇంట్లోని నగదును దొంగిలించాడు. యువకుడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఇంటి యజమాని కార్రోల్ లిన్ కర్మీచేల్(82)ను యువకుడు కత్తితో పొడిచాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన బాధితుడు లిన్‌ను హాస్పిటల్లో చేర్పించారు. పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి నిందిత యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరగనుందని, నిందితుడు తగిన శిక్ష ఎదుర్కొనున్నాడని పోలీసులు వెల్లడించారు.