:: Welcome to NRI - Article ::

రేప్ చేసి పారిపోలేదు..బాధితురాలితో ఇలా అన్నాడు

ఫ్లోరిడా: పొరుగింటి మహిళను అత్యాచారం చేసిన ఓ యువకుడు.. తప్పు చేశానని భావించాడు. పశ్చాత్తాపంగా ఇంటి పనులు ఏమైనా చేసిపెట్టాలా అని బాధితురాలిని అడిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిమోతీ అడం వాల్డింగ్ అనే 18 ఏళ్ల యువకుడు పక్కింటి మహిళపై అత్యాచారం చేశాడు. మొహానికి మాస్క్ వేసుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న మహిళ కాళ్లు, చేతులను మంచానికి కట్టేశాడు. అనంతరం అత్యాచారం చేశాడు. రేప్ చేసిన అనంతరం అక్కడి నుంచి పారిపోలేదు. మొహానికి ఉన్న మాస్క్‌ను తొలగించుకున్నాడు. తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. రేప్ చేయాలని లేదని, చేయాల్సివచ్చిందని చెప్పాడు. ఇద్దరి పిల్లల తల్లిని చంపడం ఇష్టంలేదని, తల్లిలేని తనకు తల్లి విలువ తెలుసని చెప్పాడు. ఇంట్లో లేదా పెరట్లో ఏమైనా పనులు చేసి పెడతానని మహిళను అడిగాడు. అప్పటికే భయంతో ఉన్న మహిళ.. ఎటువంటి పనులు చేయవద్దని చెప్పింది. యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరం పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసుపై దర్యాప్తు జరుపుతున్నారు.