Teen-charged-with-raping-younger-classmate-at-New-York-school

స్కూల్లోనే దారుణం జరిగింది

న్యూయార్క్: స్కూల్లో ఉన్న పిల్లలకు రక్షణ ఉంటుందని తల్లితండ్రులు, సంరక్షకులు భావించడం సహజం. కానీ అనుచిత రీతిలో జరుగుతున్న కొన్ని ఘటనలు వారిని ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ఇదేకోవకు చెందిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ది వాషింగ్టన్ ఇర్వింగ్ క్యాంపస్‌లో ఉన్న ఓ స్కూల్లో బాలికపై అత్యాచారం జరిగింది. స్కూల్‌కు చెందిన జివోన్ మార్టీన్ అనే 18 ఏళ్ల విద్యార్థి 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. స్కూల్లోని ఓ ప్రదేశంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్కూల్ అధికారుల సమాచారం మేరకు న్యూయార్క్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇద్దరూ ఒకరిమరొకరు తెలుసునని, తనవైపు చూసేవాడని, ఇలాంటి నేరానికి పాల్పడతాడని తాను భావించలేదని ఫిర్యాదులో బాలిక వాపోయింది. ఈ ఘటనపై విచారణ నేపథ్యంలో పోలీసులకు సహకరిస్తున్నామని విద్యాశాఖా అధికారులు మీడియాకు తెలిపారు.