teacher-loves-students-mother

విద్యార్థి తల్లితో ప్రేమలో పడ్డ టీచర్.. చివరికి..

కాలిఫోర్నియా, యూఎస్ఏ: టీచర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల జెస్సీ విట్‌మేయర్ అనే యువకుడు ప్రేమలో పడ్డాడు. తాను పని చేస్తున్న స్కూల్లోని ఓ విద్యార్థి తల్లితో ప్రేమలో పడ్డాడు. బాలికను స్కూల్లో దించడం, ఇంటికి తీసుకెళ్లడానికి వస్తూ పోతూ ఉన్న షైరా మిల్లర్ అనే బాలిక తల్లి క్రిష్టాతో విట్‌మేయర్ పరిచయం చేసుకున్నాడు. క్రిష్టాకు భర్త లేడనే విషయాన్ని తెలుసుకున్నాడు. 2015 నుంచి వీరివురూ స్నేహంగా మెలిగారు. క్రిష్టాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విట్‌మేయర్.. క్రిష్టా, ఆమె కూతురు షైరా మిల్లర్‌లకు ఒకేసారి తన అభిప్రాయాన్ని చెప్పాడు. తండ్రిగా తనను అంగీకరించమని మోకాలిపై కూర్చుని బాలికను అభ్యర్థించాడు. ‘నిన్ను తండ్రిగా అంగీకరించాలంటే నా తల్లికి భర్తగా మారాలి’ అని బాలిక బదులిచ్చింది. వెంటనే విట్‌మేయర్ తన ఉద్దేశాన్ని క్రిష్టాకు తెలియజేశాడు. మోకాలిపై కూర్చుని తన ప్రేమను తెలియజేశాడు. విట్‌మేయర్ ప్రేమను క్రిష్టా అంగీకరించడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. తమ కలయికలో బాలిక ముఖ్యపాత్ర పోషించిందని విట్‌మేయర్, క్రిష్టా తెలియజేశారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది.