teacher-jailed-for-6-years

గర్భంతో ఉన్న ఓ టీచర్ చేసిన పనిది

టెక్సాస్: ఆమె వయసు 28 సంవత్సరాలు.. పేరు కాథరీన్ రూత్ హార్పర్‌.. పెళ్లి అనంతరం గర్భవతైంది. అయితే ఓ స్కూల్లో చీర్‌లీడింగ్, ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేసిన ఆమె తీవ్రమైన నేరానికి పాల్పడింది. తాను పనిచేస్తున్న పాఠశాలలోని 15 ఏళ్ల వయసున్న ఓ బాలుడిని లైంగికంగా లొంగిదీసుకుంది. బాలుడితో వివాహేతర సంబంధాన్ని నెరపింది. గర్భవతిగా ఉన్న సమయంలో కూడా బాలుడితో లైంగిక చర్యలో పాల్గొంది. బాలుడితో సెల్‌ఫోన్ ద్వారా చాటింగ్ చేయడంతో వ్యవహారం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని విచారించడంతో కన్నీటిపర్యంతమయ్యాడు. నిజాలన్నీ ఒప్పుకున్నాడు. నిందితురాలు కాథరీన్ రూత్ హార్పర్‌ను అదుపులోకి తీసుకున్న సమయం 2017 ఏప్రిల్‌లో ఆమె 8 నెలల గర్భంతో ఉంది. దీంతో 15 వేల డాలర్ల వ్యక్తిగత పూచికత్తుపై బెయిలు మంజూరు చేశారు. నిందితురాలు బిడ్డకు జన్మనివ్వడంతో కేసుపై న్యాయస్థానం విచారణ జరిపింది. నిందితురాలికి 6 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. 10 ఏళ్ల నిందితురాలి ప్రవర్తన గమనించండతోపాటు లైంగిక నేరస్థురాలిగా గుర్తించాలని న్యాయస్థానం ఆదేశించింది.