teacher-caught-on-camera-punching-14-year-old-boy

సీసీ కెమెరాలో రికార్డయిన గొడవ..

కాలిఫోర్నియా: ఓ హైస్కూల్లో విద్యార్థిపై టీచర్ దాడికి దిగాడు. దాంతో విద్యార్థి కూడా టీచర్‌పై పిడిగుద్దులు కురిపించాడు. ఈ గొడవ సీసీ కెమెరాల్లో రికార్డయింది. క్లాస్ రూమ్‌లో మొదలైన టీచర్, విద్యార్థిల గొడవ క్యాంపస్‌ బయట వరకు కొనసాగింది. స్కూల్‌ గ్రౌండ్‌లో వారి గొడవ చూసిన మిగతా విద్యార్థులు వారిని నిలువరించారు. అయినా టీచర్ ఆగకుండా విద్యార్థిపై దాడి చేస్తూనే ఉన్నాడని విద్యార్థులు తెలిపారు. అయితే వారి మధ్య గొడవకు కారణాలేమిటో తెలియరాలేదన్నారు. అయితే గొడవలో భాగంగా విద్యార్థికే ఎక్కువ గాయాలు అయ్యాయని మిగతా విద్యార్థులు చెబుతున్నారు. చివరికి గొడవ సద్దుమణిగిన తరువాత విద్యార్థి వెళ్లి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశాడు. విద్యార్థిపై జరిగిన దాడిని ప్రిన్సిపల్ తీవ్రంగా ఖండించారు. గొడవ జరగడానికి గల కారణాలను తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు.