teacher-arrested-in-indiana

ఉపాధ్యాయుడి నీచమైన చర్యలు..అరెస్ట్

ఇండియానా: ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి నీచంగా ప్రవర్తించాడు. జోసెఫ్ కిమెరెర్ అనే 46 ఏళ్ల వ్యక్తి ఇండియానాలోని లఫేయేట్టే‌లో ఉన్న అమేలియా ఇర్హర్ట్ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2014లో 12 నుంచి 13 ఏళ్ల బాలురపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలురకు చెప్పకూడని విషయాలు చెప్పాడు. లైంగిక చర్యలకు సంబంధించిన అసభ్యకరమైన విషయాలు వారికి చెప్పాడు. పిల్లలకు చెడు విషయాలు నేర్పాడు. బాలుర ఫోటోలు కూడా తీశాడు. ఈ విషయాలన్నీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితుడు జోసెఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ జరుగుతున్న సమయంలోనే ఈ నిర్వాకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడు జోసెఫ్‌పై పలు రకాల కేసులు నమోదు చేశారు. విచారణ జరపనున్నామని పోలీసులు తెలిపారు.