:: Welcome to NRI - Article ::

ఒక టీచర్.. తన స్టూడెంట్స్‌తో దారుణం చేశాడు

ఫ్లోరిడా: గురువు అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలంటారు. కానీ, ఫ్లోరిడాలో ఒక టీచర్, తన స్టూడెంట్స్‌తో దారుణం చేశాడు. శుక్రవారం ఈ విషయం బయటపడటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ముగ్గురు బాలికలు కోర్టులో సాక్ష్యం చెప్పారు. అతడు, తమతో ఎంత నీచంగా ప్రవర్తించాడో వివరించారు. వారి సాక్ష్యం ఆధారంగా జడ్జ్ అతడికి 6 సంవత్సరాలపాటు జైలు శిక్ష విధించారు. ఫ్లోరిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డీఆర్గాన్(28) అనే వ్యక్తి, స్థానికంగా ఒక స్కూల్లో పిల్లలకు ఈత నేర్పిస్తుంటాడు. ముగ్గురు బాలికలను అతడు ప్రత్యేకంగా చూసేవాడు. రోజుకోకరి చొప్పున వారిని, తన గదిలోకి తీసుకెళ్లేవాడని పోలీసులు చెబుతున్నారు. వారిపై లైంగికదాడి చేయకపోయిన వారితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని వారంటున్నారు. ఈ విషయం ఒక బాలిక తల్లి కనిపెట్టింది.

బాలిక ఒంటిపై పంటి గాట్లు కనిపించడంతో ఆమె బాలికను ఏమైందని అడిగింది. తన టీచర్, కోరికాడని ఆ బాలిక తన తల్లితో చెప్పింది. అయితే ఆ బాలిక తల్లికి అనుమానం రాలేదు. తర్వాత కొద్దిసేపటికి మరోచోట కూడా అలాగే గాట్లు కనిపించాయి. చెప్పలేని చోట అలా కనిపించడంతో ఆమె అనుమానం వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని బాలిక తల్లి, స్కూల్ యజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి వారు, ఆ టీచర్‌ను ఒక కంట కనిపెట్టడం మొదలుపెట్టారు. ఒకరోజు అతడు, బాలికతో అసభ్యకరరీతిలో పట్టుబడ్డాడు. దాంతో యజమాన్యం పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు.

Loading...