teacher-arrested-for-illigal-affair

ఉపాధ్యాయురాలనే విషయాన్ని మరచి ఓ మహిళ చేసిన పనిది

టెక్సాస్: విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన కొందరు టీచర్లు తమ విధులకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఉపాధ్యాయవృత్తికి కళంకం తెస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా పరువు తీసుకుంటున్నారు. ఇదేకోవకు చెందిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
 
టీచర్‌గా పనిచేస్తున్న జామీ గొఫోర్త్ అనే 37 ఏళ్ల మహిళ తన విధులకు విరుద్ధంగా ప్రవర్తించింది. స్కూల్లోని 15 ఏళ్ల వయసున్న ఓ బాలుడితో లైంగిక సంబంధాన్ని నడిపింది. బాలుడిని లొంగదీసుకుని ఈ నిర్వాకానికి పాల్పడింది. ఈ విషయాన్ని బాలుడి తల్లితండ్రులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేశారు. ఈ కేసుపై త్వరలోనే కోర్టులో విచారణ జరగనుంది. నిందితురాలు గొఫోర్త్ దోషిగా తేలితే 20 ఏళ్ల జైలుశిక్షపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నిందితురాలి భర్త బాబీ జాక్ గొఫోర్త్ ఇదే స్కూల్లో ఫూట్‌బాల్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. నిందితురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ వెలుగులోకి వచ్చింది.