student-entered-in-a-school-with-gun-

తుపాకీతో స్కూల్‌కొచ్చి.. ఓ విద్యార్థి చేసిన పని..

ఫ్లోరిడా: అమెరికాలో పెరిగిపోతున్న తుపాకుల సంస్కృతి యువతను పెడదోవ పట్టిస్తోంది. ఒకవైపు తుపాకులను కట్టడి చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ట్రంప్ ఈ విషయంలో స్పందించాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొంతమంది తుపాకులను విచ్ఛలవిడి ఉపయోగించి అమాయకులను చంపేస్తున్నారు. ఇటీవల ఫ్లోరిడాలో ఓ స్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటనను మరువక ముందే మరో స్కూల్‌లో ఓ విద్యార్థి తన తోటి విద్యార్థులు కాల్పులు జరిపాడు. స్కూల్‌కి తుపాకీతో వచ్చి విచ్ఛక్షణ రహితంగా కాల్పులు జరిపి ఓ విద్యార్థిని గాయపరిచాడని పోలీసులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందగానే వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అతడి అరెస్ట్ చేశారు.