:: Welcome to NRI - Article ::

అమెరికాలో ఆ నగరాల్లో కరెంట్ లేదు

ఫ్లోరిడా: అమెరికా జనజీవనాన్ని ఎంతో ప్రభావితం చేసిన ఇర్మా తుఫాన్ మెల్లగా మెల్లగా శాంతిస్తోంది. దాంతో ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటికీ  పదిలక్షల మంది కరెంట్ లేకపోవడంతో అంధకారంలోనే ఉంటున్నారని వారు తెలిపారు. ఫ్లోరిడాలోని ఎన్నో నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉందన్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు .జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. దక్షిణ కారోలినా, .జార్జియాలలో కూడా పరిస్థితి అంతే తీవ్రంగా ఉందంటున్నారు.

వరదనీటితో ఇళ్లన్నీ నిండిపోయాయని ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి ఉందన్నారు. ఇళ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. అమెరికా నేవీ కూడా సహయచర్యలో పాల్గొంటుంది. ఎన్నో షిప్పుల్లో ప్రజలకు కావాల్సిన ఆహరపదార్థాలు, బట్టలను ఇంకా ఇతర వస్తువులను అందించేందుకు కృషి చేస్తున్నారని పోలీసులు తెలిపారు.