spread-on-both-ends-

అన్ని వైపులా మంటలు వ్యాపించడంతో..

కాలిఫోర్నియా: అడవిలో రాజుకున్న నిప్పు చూస్తుండగానే జనవాసాలవైపు మళ్లింది. దాంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. కార్లల్లో బయలుదేరిన కొంతమంది దట్టంగా అలుముకున్న పొగ కారణంగా తమ కార్లను అక్కడిక్కడే వదిలేసి పిల్ల,పాపలతో.. కట్టుబట్టలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు వెళ్లిపోయారు. అయితే చాలా ప్రాంతాల్లో పొగ ఇప్పటికీ అలుముకుని ఉండటంతో సహయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తెలియగానే రెస్క్యూ టీమ్ సభ్యులను రంగంలోకి దింపామని అధికారులు తెలిపారు. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతోపాటు గాలి కూడా వేగంగా వీస్తుండటం వల్ల పెను ప్రమాదమే సంభవించిందని వారు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని వారు తెలిపారు.