:: Welcome to NRI - Article ::

ఆమె డ్రెస్సు అదిరిపోయింది

అలస్కా: సాధారణంగా ఫ్యాషన్‌షో అంటే అందమైన అమ్మాయిలు అందమైన డ్రెస్సులు వేసుకుని క్యాట్ వాక్ చేస్తుంటారని మనకు తెలుసు. అందరిలాగా క్యాట్ వాక్ చేస్తే, తనకు గుర్తింపు ఏం ఉంటుందని స్కేన్ గిబ్సాన్(23), అనుకుంది. తన ప్రత్యేక అందరికీ తెలియలనుకుంది. మొత్తం 20,000 సాల్మన్ చేపల అస్థిపంజరాలను సేకరించింది. వాటితో డ్రెస్ తయారు చేసింది. అది వేసుకుని స్టీకా వీధుల్లో ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే చాలామంది నిశ్చేష్ఠులైపోయారు. ముందు ఆమె ఏ ఫ్యాషన్‌షోలో క్యాట్ వాక్ చేయకపోయిన, తన తొలి ఓపెన్‌షో ద్వారానే అందరి మన్నలను పొందింది. ఆ డ్రెస్ తయారు చేసేందుకు ఆరునెలలు కష్టపడానని ఆమె తెలిపింది. సాల్మన్ చేపల ఆస్థిపంజరాలను సేకరించి వాటిని ఎండబెట్టి తర్వాత బ్లీచింగ్ చేసి ముళ్లు గట్టిపడ్డ తర్వాత ఈ రూపం వచ్చిందని ఆమె తెలిపింది.

Loading...