shoppers-arguing-this-is-looking-like-brawlmart-not-as-walmart

వాల్‌మార్ట్‌ స్టోర్‌లో రచ్చ చేసిన అమెరికన్లు

పెన్సిల్‌వేనియా: అమెరికాలోని పెన్సిల్‌వేనియా ప్రాంతంలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో అమెరికన్లు రచ్చ రచ్చ చేశారు. చుట్టూ జనాలు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి..ఆడ, మగ అనే తేడా లేకుండా కొట్టుకున్నారు. లైన్‌లో నిలబడి ఉన్న ఒక అమ్మాయికి, అబ్బాయికి ఏదో విషయంలో గొడవ జరిగింది. అయితే అబ్బాయి ఆ అమ్మాయి జుట్టు పట్టుకోడంతో వెంటనే ఇంకో మహిళ వచ్చి అతనిని కొట్టడం మొదలుపెట్టింది. అలా ఇద్దరి మధ్య మొదలైన ఆ గొడవ గ్రూపు తగాదాలా మారిపోయింది. చుట్టూ షాపింగ్ చేస్తున్న వారందరూ వాళ్లవైపు వింతగా చూడటం మొదలుపెట్టారు. మరికొందరు మళ్లీ వాల్‌మార్ట్‌లో గొడవ..అంటూ సహజంగా తీసుకున్నారు. కొందరు ఈ గొడవను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. పబ్లిక్ ప్లేస్‌లో అలా కొట్టుకుంటున్నారేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో..వారు అక్కడకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇద్దరికి చిన్న చిన్న గాయాలైనప్పటికీ..చికిత్స చేయించుకోవడానికి వారు నిరాకరించారు. కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించిన అనంతరం క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తించినందుకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురిని వాల్‌మార్ట్ నుంచి నిషేదించారు. వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.