:: Welcome to NRI - Article ::

భయానకంగా మారిన కాలిఫోర్నియా కార్చిచ్చు ప్రాంతాలు

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో చెలరేగిన కార్చిచ్చు భయానక వాతావరణాన్ని సృష్టించింది. దాదాపు 14 ప్రాంతాలలో ఈ మంటలు చెలరేగడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఇప్పటికి 23 మంది మృతి చెందారు. దాదాపు 300 మంది గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. 3,500 భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 20,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. లక్షా 70 వేల హెక్టార్లలోని అడవి తగలబడింది. శాటిలైట్ నుంచి తీసిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. అనేక ఇళ్లు, కార్లు, చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. పచ్చగా కనిపించే ప్రాంతమంతా నల్లగా మారింది. ఈ ప్రభావంతో చుట్టుపక్కల ప్రాంతాలకు భారీగా పొగ వ్యాపించింది. అనేకమంది తమ నివాసాన్ని కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం జరిగిందని శాటిలైట్ దృశ్యాలను చూస్తే అర్థమవుతోంది.