satellite-experiment-delay--

కార్చిచ్చుతో ఉపగ్రహ ప్రయోగం వాయిదా

హైదరాబాద్‌ సిటీ/కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా అక్కడి నుంచి నిర్వహించాల్సిన ఇండియా ఉపగ్రహ ప్రయోగం వాయిదా పడింది. అయితే ఈ ప్రయోగాన్ని సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం చేసే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. కాలిఫోర్నియాలోని ఎలోన్‌ మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ అనే ప్రైవేటు ఎయిరోస్పేస్‌ సంసత్థో ఇండియా సాటిలైట్‌ ప్రయోగానికి ఒప్పందం జరిగింది. వాస్తవానికి ఈ ప్రయోగం నవంబర్‌ 19న జరపాలి. కానీ అక్కడి అడవుల్లో ఏర్పడిన అగ్నిప్రమాదం కారణంగా ప్రయోగాన్ని నవంబరు 30కి వాయిదా వేశారు. కానీ అప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రయోగం మరోసారి వాయిదా పడింది.