record-high-early-voting

రికార్డు స్థాయిలో ఓట్లు నమోదయ్యాయి..

ఫ్లోరిడా: ప్రస్తుత ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓట్లు వేశారని అధికారులు చెబుతున్నారు. 2014లో పోలైన ఓట్లతో పోల్చుకుంటే ఈ సారి ఎన్నికల్లో గరిష్ట ఓట్లు నమోదయ్యాయన్నారు. ఫ్లోరిడాతోపాటు అన్ని చోట్లా ఓటర్లు ఎన్నికల్లో తమ ఓటు వినియోగించుకున్నారని అధికారులు గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో 3.1 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటే ఈ సారి ఎన్నికల్లో 4.1 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. ఇదిలావుండగా ప్రజలకు రాజకీయాల పట్ల పెరుగుతున్న అవగాహనకు ఇదే నిదర్శనమని అధికారులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచే రాజకీయాల పట్ల ప్రజలకు మరింత అవగాహన పెరిగిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.