record-breaking-python--

పైథాన్ రికార్డ్ క్రియేట్ చేసిందని..

ఫ్లోరిడా: రికార్డ్ బ్రేకింగ్ అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. బుధవారం కొంతమంది పైథాన్ వేటగాళ్లు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక ఫోటో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఫోటోలో ఏం ఉందంటే వారు 17 అడుగులు పొడవున్న అతి పెద్ద పైథాన్‌ను వారు పట్టుకున్నారు. దక్షిణఫ్లోరిడాలో ఒక ప్రాంతంలో దాన్ని పట్టుకున్నామని జాన్సన్ లియోన్ అనే వ్యక్తి చెప్పాడు. అతడి బృందం ఫ్లోరిడాలో పైథాన్ నిర్మూలన కార్యక్రమంలో పాల్గొంటోంది. ఈ మధ్య కాలంలో పైథాన్‌ల సంఖ్య ఫ్లోరిడాలో భారీగా పెరిగిపోయిందని, అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా జాన్సన్ బృందాన్ని నియమించామని అధికారులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు అంత పెద్ద పైథాన్‌ను ఎవ్వరూ పట్టుకోలేకపోయారని అధికారులంటున్నారు.