rattle-snake-found-

రాటిల్ స్నేక్‌ల సంచారం పెరిగిందని..

కాలిఫోర్నియా: రాటిల్ స్నేక్ భయంకరమైన విషసర్పం. దాని కాటుకు గురయి సరైన సమయానికి వైద్యం అందకపోతే కొద్ది క్షణాల్లోనే మరణం సంభవిస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రాటిల్ స్నేక్‌ల సంచారం పెరిగిపోయిందని అధికారులు తెలిపారు. ఏప్రిల్1 నుంచి నేటి వరకు 20 మంది రాటిల్ స్నేక్ కాటుకు గురయ్యారని అధికారులు తెలిపారు.

అయితే సరైన సమయంలో వారికి వైద్యం అందడం వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగారని అధికారులు తెలిపారు. రాటిల్ స్నేక్ కనిపించిన వెంటనే స్నేక్ క్యాచర్ సొసైటి సభ్యులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచించారు.