racist-attack-on-Indian

అమెరికాలో మరో జాత్యాహంకార దాడి

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో మరో జాత్యహంకార దాడి చోటు చేసుకుంది. 50 ఏళ్ల సిక్కు వ్యక్తిపై ఇద్దరు అమెరికన్లు దాడి చేశారు. ఆయనను పలుమార్లు రాడ్‌తో కొట్టడంతో పాటు ‘నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు. నీ దేశానికి వెళ్లిపో’ అని హెచ్చరించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా కాలిఫోర్నియాలో ఇటీవలి కాలంలో సిక్కులపై దాడులు పెరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో సిక్కు వర్గానికి చెందినవారు అధికంగా ఉండటం గమనార్హం. అయితే భారతీయులపై ఇటువంటి దాడులు వరుసగా జరుగుతుండటంతో ప్రవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.