rabies-virus-spreading-

రేబిస్ వైరస్ వ్యాప్తి చెందుతోందని..

ఫ్లోరిడా: రేబిస్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా రేబిస్ జంతువుల వల్ల వ్యాప్తి చెందుతుందన్నారు. అది కూడా పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు, ఇతర జంతువుల వల్లే వ్యాప్తి చెందుతోందని వారు తెలిపారు. కేవలం కుక్కలు, పిల్లులే కాకుండా గబ్బిలాలు, నక్కల వల్ల కూడా రేబిస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. అయితే పెంపుడు జంతువులకు తప్పకుండా యాంటీ రేబిస్ టీకాలు వేయించాలని అధికారులు యజమానులకు సూచిస్తున్నారు.

ఇప్పటికే కొన్ని పెంపుడు జంతువుల్లో రేబిస్ వైరస్ ఉన్నట్లు గుర్తించామన్నారు. తమ వద్ద టీకాలు వేయించేందుకు వాటి యజమానులు వెంట తీసుకొచ్చారని వారు తెలిపారు. ఆ సమయంలో మూడు పెంపుడుకుక్కలు, ఒక రకూన్‌లో రేబిస్ వైరస్ లక్షణాలు గుర్తించామని అధికారులు తెలిపారు.