:: Welcome to NRI - Article ::

భార్యాభర్తల బంధాన్ని ఓ కుక్క బతికిస్తోంది.

టెక్సాస్: మనుషులతో ముడిపడివున్న పెంపుడు జంతువుల పాత్ర ఎలాంటి తెలియజేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 21 ఏళ్ల వయసున్న రెబెక్కా, 22 సంవత్సరాల ఫ్రాంకీ అనే జంట 2012లో పెళ్లి చేసుకున్నారు. వారి వైవాహిక జీవితంలోకి 9 నెలల వయసున్న ఓ కుక్కపిల్ల వచ్చింది. అపోలో అని పేరు పెట్టిన ఆ కుక్కపై ఇద్దరూ ప్రేమ పెంచుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల 2015లో వారిద్దరూ విడిపోయారు. వేరువేరు నగరాల్లో ఉంటున్నారు. కుక్కను మాత్రం విడిచిపెట్టడానికి ఇద్దరూ ఇష్టపడలేదు. రెబెక్కా వద్దనే కుక్కను వదిలివెళ్లాడు ఫ్రాంకీ. కానీ అపోలోపై ఇష్టాన్ని మాత్రం తగ్గించుకోలేదు. అపోలో ప్రతీ పుట్టిన రోజుకి గిఫ్టులు, గ్రీటింగ్ కార్డులు పంపించడం, వెళ్లి చూడడం కొనసాగిస్తున్నాడు. ఇటీవలే జరిగిన కుక్క పుట్టిన రోజుకు కూడా గిఫ్టులు పంపించాడు. ఈ విషయాన్ని రెబెక్కా సోషల్ మీడియాలో వివరించింది. దీంతో వైరల్‌గా మారింది. భార్యాభర్తలు మళ్లీ కలవాలని కోరుతున్నారు. కనీసం కుక్క గురించి ఆలోచించైనా దగ్గరవ్వాలని, కుక్క మీ ప్రేమను బతికిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఘటన పలువురిని ఆకర్షిస్తోంది. మనుషుల జీవితాల్లో పెంపుడు జంతువుల పాత్ర మరచిపోలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
Loading...