Prominent-lawyer-dies-after-setting-himself-on-fire

ఆత్మహత్య చేసుకున్న న్యాయవాది..కారణం ఇదే

న్యూయార్క్, యూఎస్‌ఏ: అమెరికాకు చెందిన ప్రముఖ న్యాయవాది, గే హక్కుల ఉద్యమకర్త డేవిడ్ బుకెల్(60) ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్లోబల్ వార్మింగ్‌కు నిరసనగా న్యూయార్క్‌లోని బ్రూక్‌లిన్ ప్రొస్పెక్ట్ పార్క్‌లో ఒంటికి నిప్పంటించుకుని చనిపోయారు. పర్యావరణ మార్పులకు నిరసనగా ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆయన సూసైడ్ నోట్ రాశారు. ఆత్మహత్యకు పాల్పడుతున్నందుకు క్షమించాలని కోరారు. ఇంధనాల వాడకం భూమిని ఏవిధంగా దహించి వేస్తోందో చూపించడమే తన ఉద్దేశమని, అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డానని లేఖలో పేర్కొన్నారు. రాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడడంతో ఎవరూ గర్తించలేదు. శనివారం ఉదయం జాగింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.