:: Welcome to NRI - Article ::

ప్రజలు ఇళ్లను ఖాళీ చేయండి: పిలుపునిచ్చిన గవర్నర్

ఫ్లోరిడా: ప్రజలు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహలకు వెళ్లాలని ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ పిలుపునిచ్చారు. ఇప్పటికే ఫ్లోరిడా మూడు తుఫాన్‌లను ఎదుర్కొందని వాటి కారణంగా 47 మంది ప్రజలు చనిపోయారని ఆయన అన్నారు. గత వారం రోజులుగా భయంకరమైన తుఫాన్ ఫ్లోరిడా జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లోరిడాలోని  6.5 మిలియన్ల మంది ప్రజలు ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారని వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజల రక్షణ బాధ్యతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆయన భరోసానిచ్చారు.

ప్రజలు ఇళ్లల్లో ఉంటే ప్రభుత్వం ఏమి చేయలేదని ఇదే చివరి అవకాశమని ఆయన ప్రజలకు విన్నవించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గృహల్లో ఉంటే ప్రభుత్వమే మీ రక్షణకు బాధ్యత వహింస్తుందని ఆయన హమీ ఇచ్చారు. ముసలివారు, పసిపిల్లలు ఇంట్లో ఉంటే తుఫాన్ సమయంలో జరగరానిది జరిగితే కోలుకోలేని దెబ్బ ఆ కుటుంబాలపై పడుతుందని దాన్ని నివారించాలంటే ప్రజలు ఇళ్లను వదిలేయాలని స్కాట్ పిలుపునిచ్చారు.