:: Welcome to NRI - Article ::

మహిళా పేషెంట్.. డాక్టర్ గొడవ

ఫ్లోరిడా: ఒక మహిళ పెషేంట్, డాక్టర్ మధ్య జరిగిన గొడవ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఫ్లోరిడాకు చెందిన జెస్సికా స్టెప్ అనే మహిళ గిన్నెస్‌విల్లేలో ఒక ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లింది. డాక్టర్ రాక కోసం వెయిటింగ్ రూమ్‌లో కూర్చుని ఉంది. ఆమెతోపాటు కూతురు కూడా ఆసుపత్రికి వచ్చింది. గంట గడిచిన డాక్టర్ రాకపోవడంతో ఆమె కోపం పెరిగిపోయింది. వెంటనే ఆసుపత్రిలో ఫర్నీచర్ ధ్వంసం చేయడం మొదలుపెట్టింది.

సిబ్బంది ఆపబోయిన ఆమె ఆగలేదు. అప్పటికే డాక్టర్ ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆమె డాక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. డాక్టర్‌తోపాటు ఆయన గదిలోకి వెళ్లింది. ఆ మొత్తాన్ని జెస్సికా కూతురు మొబైల్ ఫోన్‌లో వీడియో తీసింది. డాక్టర్‌ను తీవ్రంగా తిట్టుతూ ఉండగా సిబ్బంది బలవంతంగా ఆమెను ఆసుపత్రి బయటకు పంపించారు. తాను గర్భవతినని  ఆసుపత్రిలో  తాను చెల్లించిన డబ్బు తనికివ్వాలని జెస్సికా కోరింది. అంతేకాదు తనకు డాక్టర్ ట్రీట్‌మెంట్ ఎంతమాత్రం సంత‌ృప్తిగా లేదని ఆరోపించింది. అయితే జెస్సికా మానసిక సమస్యలతో బాధపడుతోందని అందుకే అలా ప్రవర్తిస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.