parents-got-trail-

పిల్లాడిని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి..

ఫ్లోరిడా: చిన్న పిల్లలకు విదేశాల్లో ఎంతో రక్షణ కల్పిస్తుంటారు. వారికి హని కలిగించేలా ఎవ్వరూ వ్యవహరించిన కఠిన చర్యలు తీసుకుంటారు. చివరికి తల్లిదండ్రులైన సరే పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిందే గానీ, వారు తప్పు చేసినా పిల్లల్ని కొట్టే హక్కు మాత్రం తల్లిదండ్రులకు ఉండదు. అయితే కొట్టకపోయినా కూడా తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారు చేసిన నేరం ఏమిటంటే చిన్న పిల్లాడిని ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఒంటరిగా వదిలిపెట్టి బయటకు వెళ్లడమే, దాంతో తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. జెన్నిఫర్ నికోలస్(32) ఆమె భర్త శాండర్స్‌లు తమ కొడుకును ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి అతడిని భయపెట్టే ప్రయత్నం చేశారని చట్ట రీత్యా ఆ పని నేరమని పోలీసులు చెబుతున్నారు. పక్కింటి వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులను పోలీసులు కోర్టులో హజరుపరిచారు.