parcile-bomb-in-america-

ఇంటి ముందు పార్శిల్ కవర్ కనిపిస్తే.. తొందరపడి తెరవకండని..

టెక్సాస్: ఇంటి ముందు పార్శిల్ కవర్ కనపడుతోంది. పొరపాటున దాన్ని తెరిచి చూడాలని ప్రయత్నించి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వరుసగా ఇలాంటి సంఘటనలు మూడు జరిగాయని పోలీసులు తెలిపారు. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు వ్యక్తులు మరణించారని వారు చెప్పారు. పోలీసులు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. బాంబు పెట్టి ఉండే పార్శిల్ కవర్‌లను కొంతమంది వ్యక్తులు కావాలనే ఇళ్లకు ముందు వదిలివెళ్తున్నారని వారు చెప్పారు. అలాంటి పార్శిల్ కవర్లు కనిపిస్తే వాటిని తెరవకుండా తప్పకుండా తమకు సమాచారం అందించాలని వారు ప్రజలకు సూచిస్తున్నారు. ఇదిలావుండగా దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇలాంటి సంఘటనలు మూడు జరగడం కలకలం సృష్టించింది. ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కూడా నెలకొన్నాయని పోలీసులు చెప్పారు. అలాగే నిందితులను పట్టుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు.