:: Welcome to NRI - Article ::

ఆకాశంలో పెద్ద శబ్దం..బయటకొచ్చి చూస్తే కనిపించింది ఇది

జార్జియా: ఆకాశంలో ఏదో పేలిన పెద్ద శబ్దం వినిపించింది. విమాన ప్రమాదం జరిగివుంటుందేమోనని భావించిన ఓ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చి పరిశీలించగా ఏమీ కనిపించలేదు. కానీ.. ఓ ప్రదేశంలో గడ్డి మండుతూ, గుండ్రని ఆకారంలో మంటలు వ్యాపించడాన్ని ఆ వ్యక్తి గమనించాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏం జరిగిందో అర్థం చేసుకోలేకపోయాడు. ఫోటోలను తీసి పోస్టు చేయగా జే సల్లీవాన్ అనే ఆ వ్యక్తి సందేహానికి సమాధానం దొరికింది. ఆకాశంలో ఉల్కాపాతం జరిగిందని, మండుతున్న పదార్థం కింద పడడం వల్ల గడ్డి గుండ్రని ఆకారంలో మండిందని ఓ నిపుణుడు తెలిపారు. దీంతో సల్లీవాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పెద్ద శబ్దం వచ్చిందని, భయంతో బయటకు వచ్చి చూస్తే మంటలు కనిపించడంతో భయం మరింత పెరిగిందని తెలిపాడు. ఈ ఘటన అమెరికాలోని జార్జియాలో వెలుగులోకి వచ్చింది.