obese-said-aunt-used-to-spoil-him-with-food

272 కేజీల బరువు పెరిగాడు..కారణం ఇదేనట

సౌత్ కరోలినా: స్థూలకాయ సమస్యతో బాధపడుతున్న వారి సమస్యలు అన్నీ ఇన్నీ కావు. శ్వాస సరిగా తీసుకోలేరు. ఎటూ కదల్లేరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్థూలకాయంతో బాధపడేవారికి అన్నీ సమస్యలే.. కానీ అంతలా భారీగా బరువు పెరడానికి కొన్ని కారణాలు ఉంటాయి.  ఇదే విషయాన్ని చెపుతున్న ఓ భారీ స్తూలకాయుడు.. ఎక్కువగా తినే అలవాటుకు దూరంగా ఉంటే తనలా తయారవ్వరని చెపుతున్నాడు. 

పేరు జేమ్స్ ఎల్‌బీ బొన్నర్. వయసు కేవలం 25 సంవత్సరాలే. బరువు అక్షరాలా 272 కేజీలు. ఈ భారీ బరువకు తోడు ఓ రోడ్డు ప్రమాదం ఓ కాలుని పొగొట్టుకున్నాడు. దీంతో జేమ్స్ ఎల్‌బీ బొన్నర్ తీవ్రమైన కష్టాలను అనుభవిస్తున్నాడు. బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. బరువు తగ్గడానికి కొన్ని చిట్కాలను ఓ టీవీ కార్యక్రమంలో చెపుతున్నాడు. ఈ వారం కూడా చిట్కాలు చెప్పడానికి వచ్చిన జేమ్స్ ఎల్‌బీ బొన్నర్ తాను ఇంతలా బరువు పెరగడానికి గల కారణాలను చెప్పాడు. 
 
‘‘ఎల్‌బీ అంట్ దొర అనే మహిళ తనను చిన్నప్పుడే దత్తతు తీసుకుంది. ముగ్గురూ ఆడపిల్లలే పుట్టడంతో అబ్బాయి ఉండాలనే ఉద్దేశ్యంతో నన్ను దత్తతు తీసుకున్నారు. నా తొమ్మిదవ ఏడాది అమ్మ అంట్ దొర చనిపోయింది. అమ్మ మృతితో ఏడ్చీ ఏడ్చీ అన్నం తినడం మానేశాను. బాగా బక్కచిక్కిపోయాను. నన్ను బాగా ఇష్టపడే మా ఆంటీ ఈ విషయాన్ని గమనించారు. నాకు మంచి ఆహారం పెట్టేవారు. బాగా తినాలని ప్రొత్సహించారు. ఏదీ అడిగితే అది కొనిచ్చేవారు. అలా తినీ తినీ.. ఇలా తయారయ్యారు. నేను ఇంతలా బరువు పెరగడానికి ఆమె కారణం. ఇప్పుడు బరువుతగ్గడం చాలా కష్టంగా ఉంది. అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాను. కానీ తలచుకుంటే బరువు తగ్గొచ్చు’’ అని చెప్పాడు జేమ్స్ ఎల్‌బీ బొన్నర్. ఇదిలావుండగా ఎనిమిదేళ్ల వయసులో సుమారుగా 60 కేజీలు మాత్రమే ఉండేవాడినని అన్నాడు. అసలే భారీ బరువు.. పైగా ఓ కాలు కూడా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. కానీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా బరువుతగ్గేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు.