:: Welcome to NRI - Article ::

10 ఏళ్ల పిల్లాడితో నర్సు చేసిన నీచమైన పని ఇది

కాలిఫోర్నియా: ఓ మహిళ నీచమైన పని చేసింది. 10 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలతో లైంగికచర్యలో పాల్గొంటూ వీడియో తీయించుకుంది. అవి బయటపడటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే వాటిలో ఉన్నది తాను కానంటూ ఆమె కోర్టులో చెప్పింది. విచారణ జరిపిన నిపుణుల బృందం ఆమె ఆ పని చేసిందని తేల్చారు. ఇమ్లి జోయ్ స్టెఫెన్స్(30) అనే మహిళ టస్కాన్ కంట్రీలో ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.

ఆమె ఇంటి పక్కనున్న పిల్లలతో స్నేహంగా ఉంటుంది. తరచూ పిల్లలు ఆమె ఇంటికి వెళ్తుండేవారని స్థానికులు చెప్పారు. అయితే ఇలాంటి పని ఇమ్లి చేస్తుందని తాము గ్రహించలేకపోయమన్నారు. ఒకరోజు పిల్లలు తమ మొబైల్‌ఫోన్‌లో సెక్స్ వీడియోలు చూస్తున్నారని జేమ్స్ అనే వ్యక్తి చెప్పాడు. ఆ వీడియో చూడగా అందులో ఉన్నది ఇమ్లి అని గుర్తించానన్నాడు. ఆ వీడియోను కొందరు షేరు కూడా చేసుకున్నారని దాంతో విషయం బయటపడిందని జేమ్స్ చెప్పాడు. వెంటనే పిల్లల తల్లిదండ్రులు ఇమ్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇమ్లిని అరెస్ట్ చేశారు.   

Loading...