no-power-in-California-

కరెంట్ కోత.. వేడి.. ఉక్కపోత.. ఏం జరిగిందంటే

కాలిఫోర్నియా: ప్రకృతి విపత్తుల ముందు ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా తలొంచాల్సిందే. ప్రస్తుతం కాలిఫోర్నియా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకవైపు కాలిఫోర్నియా అడవుల్లో రగులుతున్న కార్చిచ్చు ఇంకా చల్లారలేదు. మరోవైపు  మంటల ద్వారా  వ్యాప్తిస్తున్న వేడి గాలులు, వేగంగా వీస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దానికితోడు దక్షిణకాలిఫోర్నియాలో కరెంట్ కోతలు విధించారు. ఎప్పుడూ ఇలా జరగలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా తాము చీకట్లోనే కాలం వెల్లదీస్తున్నామని వారంటున్నారు.

అధికారులు కూడా కరెంట్ పునరుద్ధరిస్తామని చెబుతున్నారు. కానీ, ఇప్పట్లో అది సాధ్యం కాదంటున్నారు. ఎన్నో చోట్ల భారీ స్తంబాలు విరిగిపోయాయని, వాటి స్థానంలో కొత్త వాటిని బిగించాలంటే ఇంక కొంత కాలం వేచిచూడాలంటున్నారు. ఇప్పటికే 11 వేల మంది ప్రజలు అడవి ప్రాంతంలో నివస్తున్నారని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు చెప్పారు. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో ఆ ప్రాంతంలో వేడి ఉక్కపోత ఎక్కువగా ఉన్నాయని వారు చెప్పారు. ప్రమాదం అంచుల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.