newlywed-couple-killed

పెళ్లయిన రెండు గంటల్లోనే ఘోరం జరిగింది

శాన్‌ఆంటోనియో: విధి వారిని చిన్నచూపు చూసింది. ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నామని అనుకుంటుండగానే నవదంపతులు ఘోర ప్రమాదంలో మరణించారు. పెళ్లయిన రెండు గంటలకే ఈ ప్రమాదం జరిగి భార్యాభర్తలిద్దరూ చనిపోవడం అందరినీ తీవ్రంగా కలచివేసింది. విలియంబ్లేర్(32), బెయిలీ(26)లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇకపై అంత సంతోషంగా ఉంటుందని భావించారు. అయితే వారి అనుకున్నదొకటి జరిగింది మరొకటి! ఫామ్‌హౌజ్‌లో పెళ్లి చేసుకుని హెలికాప్టర్‌లో ఇంటికి బయలుదేరారు. వారు బయలుదేరిన గంటలోపే హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నవదంపతులతోపాటు పైలెట్ కూడా అక్కడిక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు. పెళ్లి జరిగి రెండు గంటలు కూడా గడవకముందే వారిద్దరూ చనిపోవడంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.