never-sit-in-trally-in-a-truck-

యాక్సిడెంట్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందని..

కరోలినా: రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అలాగే రోడ్డు ప్రమాదాల బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే రోడ్డు ప్రమాదాలు జరగడానికి మొట్టమొదటి కారణం వాహనాదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమేనని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు కొంతమంది తమ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు కూడా నిర్లక్ష్యంగా కూర్చుంటున్నారని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ట్రక్కులపై హైవే రోడ్లల్లో ప్రయాణించే సమయంలో లగేజీ క్యాబిన్‌లలో అస్సలు ప్రయాణించొద్దని ప్రయాణికులకు అధికారులు సూచిస్తున్నారు.

ట్రక్కుల్లో లాగేజి క్యాబిన్‌లలో ప్రయాణించడం వల్ల యాక్సిడెంట్ జరిగితే తప్పకుండా వారు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ట్రక్కుల్లో లగేజి క్యాబిన్‌లో ప్రయాణించే సమయంలో యాక్సిడెంట్ జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిపేందుకు కరోలినా ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియోను రూపొందించారు. ఓ బొమ్మను ట్రక్కు లగేజి క్యాబిన్‌లో కూర్చోబెట్టి మరో ట్రక్కుతో దాన్ని వేగంగా ఢీకొట్టించారు. దాంతో బొమ్మ చాలా ఎత్తు వరకు గాలిలో ఎగిరి కిందపడింది. అదే మనిషి ఆ స్థితిలో ఉంటే తప్పకుండా ప్రాణాలు కోల్పోతాడని అధికారులు హెచ్చరిస్తున్నారు.