Mystery-animal-found

వింత జీవిని పట్టుకున్నాడు.. సోషల్ మీడియాలో వైరల్..

ఫ్లోరిడా: అదో వింత జీవి. అన్ని జీవుల్లా కాకుండా ఆ జీవి చూసేందుకు వింతగా ఉండటంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం దాని ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఫ్లోరిడాలో ఓ హైవే రోడ్డుపై కారు వెళ్తోంది. కారు కింద భాగంలో ఓ వింత జీవి బయటకు చూస్తోంది. అంతలో ఓ వాహనాదారుడు ఆ జీవిని పరిశీలించి చూశాడు. అతడు అలాంటి జీవిని అప్పటివరకు చూడకపోవడంతో పరీక్షగా చూశాడు. అదేంటో అతడికి అంతుబట్టలేదు. కొద్ది క్షణాల తర్వాత కారు సిగ్నల్ పడటంతో ఆగిపోయింది. వెంటనే ఆ వాహనాదారుడు కారు నడుపుతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లాడు. కారు కింద భాగంలో ఓ జీవి కనిపిస్తోందని చెప్పాడు. దాన్ని తానే పట్టుకున్నానని కారు యజమాని సమాధానమిచ్చాడు. అరుదైన జీవుల్లో అది ఒకటన్నాడు. కొద్దిరోజుల క్రితమే దాన్ని పట్టుకున్నానని తెలిపాడు. మొదట్లో అది తీవ్ర అనారోగ్యానికి గురయిందని ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నాడు. దానికి ఎప్పుడూ వెచ్చటి వాతావరణం కావాలన్నాడు. అందువల్ల కారు కిందభాగంలో ఇంజన్‌కు దగ్గరగా దాన్ని ఉంచానని అతడు తెలిపాడు.