Muhammad-Ali-Jinnah-Way-inaugurated-in-Brooklyn-New-York

కల నెరవేరింది.. అమెరికాలో పాకిస్తాన్ ప్రజల సంబరాలు

బ్రూక్లిన్: న్యూయార్క్ సిటీ కౌన్సిల్ అమెరికాలోని ఓ ప్రాంతానికి పాకిస్థాన్ స్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా పేరును పెట్టింది. దీంతో అమెరికాలో జీవిస్తున్న పాకిస్థాన్ దేశస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ‘కోనే ఐల్యాండ్ అవెన్యూ వే’గా  ఉన్న పేరును ‘మహమ్మద్ అలీ జిన్నా వే’ గా నామకరణం చేశారు. న్యూయార్క్ సిటీ కౌన్సిల్ గతేడాది డిసెంబరు 26న మహమ్మద్ అలీ జిన్నాకు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన వందలాది మంది ఈ నామకరణ కార్యక్రమంలో పాల్గొని ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ జేజేలు కొట్టారు. కాగా, కోనే ఐల్యాండ్ ఎవెన్యూ ప్రాంతంలో మొదటినుంచీ పాకిస్థాన్ దేశస్థులే అధిక సంఖ్యలో జీవిస్తున్నారు. ఆ ప్రాంతంలోని దుకాణాలు కూడా ఎక్కువ శాతం పాకిస్థానీలకు చెందినవే. పైగా ఎటు చూసినా ఉర్దూ, పంజాబీ భాషలు మాట్లాడేవారే ఎక్కువగా కనిపిస్తారు. అమెరికాకు వచ్చే ప్రతి పాకిస్థానీ కోనే ఐల్యాండ్ వేలో జీవించడానికే ఇష్టపడతారని..వారందరూ ఈ ప్రదేశాన్ని మినీ పాకిస్థాన్ అని పిలుస్తారని పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ తెలిపారు.