mudslides-in-california-

వరుస ప్రకృతి విపత్తులతో ప్రజలకు ఇబ్బందులు..

కాలిఫోర్నియా: అమెరికా ప్రజలను వరుస ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. కాలిఫోర్నియాలో మొన్నటి వరకు భారీ కార్చిచ్చు అడవులను కాల్చేసింది. అది మరువకముందే మరోసారి కొండచరియాలు విరిగిపడి బురద ఊళ్లకు ఊళ్లనే తుడిపెట్టేసింది. ఇప్పటికే 17 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. హెలికాఫ్టర్‌లు, రెస్క్కూ డాగ్స్ ద్వారా బురదలో చిక్కుకున్న మనుషులను గుర్తించే పని మొదలుపెట్టామని అలా ఇప్పటివరకు 17 మంది మృతదేహల్ని వెలికి తీయగలిగామని అధికారులు చెప్పారు. కాలిఫోర్నియాలోని 101 హైవే రోడ్డుపై బురద మెట వేసిందని రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. సోమవారం నాటికి రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని వారు తెలిపారు. ఎక్కువ మంది చెట్లపైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారని అధికారులు చెప్పారు. కొంతమంది ఇళ్లల్లోనే ఉండిపోయారని వారు ప్రమాదంలో ఉన్నట్లేనని వారు అంటున్నారు.